హామీ మాట మ‌రిచారా..!

 న్యూఢిల్లీ:  విభ‌జ‌న చ‌ట్టంలో చెప్పిన హామీ ల‌ను మ‌రిచిపోయారా అని వైఎస్సార్సీపీ పార్ల‌మెంట‌రీ ప‌క్ష నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు.  చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన విశాఖ రైల్వే జోన్‌ను ఏంచేశారని, ప్రస్తుతం దాని స్థితి ఏంటని ఆయ‌న  రైల్వే మంత్రి సురేష్ ప్రభును ప్రశ్నించారు. బుధవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇచ్చిన అనంతరం వివిధ పార్టీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వగా ముందుగా నలుగురైదుగురు సభ్యులు మాట్లాడారు. ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని మేక‌పాటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌శ్నించారు. 

తాజా ఫోటోలు

Back to Top