పులివెందులలో బిజీబిజీగా వైఎస్ విజయమ్మ

పులివెందుల: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్. విజయమ్మ సోమవారం వివిధ కార్యక్రమాల్లో బిజిబిజీగా గడిపారు. పులివెందులలో మున్సిపాలిటీకి సంబంధించిన అనేక అంశాలపై మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వై.ఎస్.మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యే వై.ఎస్. విజయమ్మతో చర్చించారు. ప్రధానంగా పెండింగ్ సమస్యలతోపాటు ఇతరత్రా కార్యకర్తలకు సంబంధించిన అంశాలపై క్యాంపు కార్యాలయంలో మాట్లాడుకున్నారు.

మహిళలతో మాటామంతీ

పులివెందులకు చెందిన పలువురు మహిళలు ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మను కార్యాలయంలో కలిశారు. పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత ఆధ్వర్యంలో మహిళలు తమ తమ సమస్యల ను విజయమ్మకు వివరించారు. పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన పలు సమస్యలను పట్టణ పరిశీలకుడు వరప్రసాద్ ఎమ్మెల్యే విజయమ్మ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తొండూరు మండల కన్వీనర్ వైవీ మల్లికార్జునరెడ్డి, పరిశీలకుడు రామమునిరెడ్డి, జిల్లా సెక్రటరీ బండి రమణారెడ్డి, లిం గాల కన్వీనర్ సుబ్బారెడ్డి, వేముల మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, వేంపల్లె పరిశీలకుడు రామమునిరెడ్డి, పులివెందుల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు పసుపులేటి రవి, ట్రేడ్ యూనియన్ నాయకులు చిన్నప్ప, చక్రాయపేట మా జీ ఎంపీటీసీ సభ్యులు బెల్లం కృష్ణారెడ్డి, వై.ఎస్.విజయమ్మతో చర్చించారు.

విజయమ్మను కలిసిన అనంత, కర్నూలు జిల్లాల కార్యకర్తలు

పులివెందులలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్న వై.ఎస్. విజయమ్మను సోమవారం సాయంత్రం ఇతర జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిశారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం సర్వాయపల్లెకు చెంది న 20మంది వైఎస్‌ఆర్ అభిమానులు విజయమ్మను కలిశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు వచ్చి ఎమ్మెల్యే వై.ఎస్. విజయమ్మతో చర్చించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వై.ఎస్.విజయమ్మ వారికి సూచించారు.

వైఈఎస్ (యంగ్ ఎనర్జిటిక్ సొసైటీ) సభ్యులకు విజయమ్మ అభినందన

వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా పులివెందులలో రక్తదాన శిబిరం నిర్వహించిన వైఈఎస్ సభ్యులను ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ అభినందించారు. వైఈఎస్ సభ్యులు వీరారెడ్డి, ప్రవర్థన్‌రెడ్డి, వివేకానందరెడ్డి, అశోక్ యాదవ్, విజయ్‌కాంత్, ఉదయ్‌కిరణ్ తదితరులు వృత్తిరీత్యా వివిధ రకాల ఉద్యోగాలలో ఉన్న మహానేత వైఎస్‌ఆర్ వర్దంతిని పురష్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు విజయమ్మ వారిని అభినందించారు.

‘ఇంటర్ యూన్సివర్సిటీ టోర్నమెంటు’ ప్రారంభానికి విజయమ్మకు ఆహ్వానం

యోగివేమన యూనివర్శిటీ పరిధిలో ఉండే దాదాపు 140 కళాశాలలకు చెందిన 1000మంది విద్యార్థులు పాల్గొనే ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంటు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మను వైఎస్‌ఆర్ లయోలా డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆహ్వానించింది. పులివెందులలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం లయోలా కళాశాల ప్రిన్సిపల్ అమల్‌రాజ్, జియాలజి లెక్చరర్ డాక్టర్ ఎన్. రామకృష్ణారెడ్డి, కామర్సు లెక్చరర్ వై.చంద్రశేఖరరెడ్డి, అకౌంటెంట్ కృష్ణారెడ్డి, ఫిజికల్ డెరైక్టర్ వి.చంద్రశేఖరరెడ్డి, వై.ఎం.చెన్నారెడ్డి, లైబ్రేరియన్ సిద్ధారెడ్డి తదితరులు వై.ఎస్.విజయమ్మను కలిసి ఈనెల 21న టోర్నమెంటు ప్రారంభోత్సవానికి రావాలని కోరారు.

Back to Top