జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు ఆదర్శప్రాయుడు

గుడివాడ‌: మహాత్మా జ్యోతీరావుపూలే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆదర్శ ప్రాయుడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. స్థానిక శరత్ థియేట‌ర్‌లో స‌మీపంలో వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ.. బలహీన వర్గాల ఆశాజ్యొతిగా పూలే నిలిచాడని అన్నారు. ఆయన బాటలో తమ పార్టీ నడుస్తుందని అన్నారు. వైయస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు మాట్లాడుతూ బీసీ వర్గాల ఉన్నతికి పోరాడిన వ్యక్తి పూలే అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ అడపా బాబ్జీ, వైయస్సార్‌సీపీ కౌన్సిలర్లు గొర్ల శ్రీనివాసరావు, సర్ధార్‌బేగ్, పార్టీ సీనియర్‌ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, పాలేటి చంటి, అల్లం రామ్మోహనరావు, జ్యోతుల శ్రీనివాసరావు, గుడివాడ రూరల్‌ మండల పార్టీ అద్యక్షులు మట్టా జాన్‌విక్టర్, బీసీ నాయకులు ఉరిటి కృష్ణమూర్తి, మాజీ కౌన్సిలర్లు షేక్‌గౌస్, గణపతి శివ, మడకా అరవింద్‌ , చుండూరి శేఖర్, ఆంజనేయప్రసాద్‌ పాల్గొన్నారు.

Back to Top