ప్రజలు నవ్వుకుంటున్నారు బాబు

ఏడు సమావేశాల్లో అంతా ఎదురుదాడే
ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పనైనా చేశారా..?
ప్రభుత్వ తప్పులను, అవినీతిని నిలదీస్తే అడ్డుకోవడం
ప్రతిపక్ష నాయకునిపై దూషణలకు దిగడం 
మంత్రుల భాషను చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు
శాసనసభను కూడా దిగజార్చిన చరిత్ర టీడీపీదిః శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్ః  రెండేళ్లలో ఏడుసార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం....ఒక్కసారి కూడా హుందాగా నిర్వహించిన పాపాన పోలేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను, అవినీతిని ఎత్తిచూపిన ప్రతిపక్ష నాయకునిపై ఎదురుదాడి చేస్తూ దుశ్సాసన పర్వానికి తెరలేపారని ఫైరయ్యారు. శాసనసభా సమావేశాల్లో మంచి చట్టం చేయడంలోగానీ, అర్థవంతమైన చర్చ జరపడంలోగానీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అన్నీ వింత పోకడలు,  ప్రతిపక్షాన్ని తప్పుదోవ పట్టించి ఎదురుదాడి చేయడమే సిద్ధాంతమన్న రీతిలో సభను నడిపారని విమర్శించారు. 

అవినీతికి అడ్డుపడుతున్నాడన్న కక్షతో అధికార సభ్యులు ప్రతిపక్షనాయకునిపై పగ, ధ్వేయం పెంచుకున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు ప్రతిపక్ష నాయకుడు సభకు కొత్తని చెప్పి  ప్రభుత్వం తప్పించుకుందే తప్ప...శాసనసభలో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పని చేయలేదన్నారు.  నూరు కౌరులు ఉన్నా అది చాలక ఇంకొంతమంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోళ్లు చేయడం సిగ్గుచేటని శ్రీకాంత్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏ ఒక్క మంచి పనైనా చేశారా..? ఆత్మపరిశీలన చేసుకోవాలని అధికార టీడీపీకి సూచించారు. 

ప్రమాణస్వీకారం సాక్షిగా చేసిన  ఐదు సంతకాల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా...? అని శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబును నిలదీశారు. ఏమీ చేయకపోగా పైపెచ్చు అభివృద్ధికి ప్రతిపక్ష నాయకుడు ఆటంకంగా ఉన్నారని మాట్లాడుతున్నారు.  రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ అవినీతమయం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని  తాము అడుగుతుంటే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అబాంఢాలు వేస్తున్నారు.  రాష్ట్రాభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని మొదటి నుంచి చెబుతున్నాం. ఏనాడు  అధికార టీడీపీ ప్రతిపక్షం ఇచ్చిన సలహాలను తీసుకుంది లేదు. అన్ని రకాలుగా విఫలమయ్యారు. శాసనసభను కూడా దిగజార్చిన చరిత్ర టీడీపీదని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు.

సభలో ప్రతిపక్ష నాయకుని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక మైక్ కట్ చేస్తున్నారు. మంత్రులు వాడే బాషను చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. యనమల రామకృష్ణుడు సలహాలతో  సభను నడిపిస్తున్నారు. స్పీకర్ యనమల రామకృష్ణుడా లేక కోడెల శివప్రసాదరావో అర్థం కాని పరిస్థితి. మహిళా శాసనభ్యురాలని కూడా చూడకుండా వేధించారు. నిర్ధాక్షిణంగా రికార్డ్స్, రూల్స్ ను డిలేట్ చేస్తారు. బీఏసీలో చర్చించిన అంశాలను పాటించరు. తీర్మానాలు అంటారు. ఎవరికి అర్థం కాని రీతిలో వాళ్లకు వాళ్లే పొగుడుకుంటారు. అవి ఎందుకు పెట్టారో అడుగుదామంటే మైక్ ఇవ్వరు. మీ అజెండా ప్రకారమే సభను నడిపించుకుంటున్నారు. రెండేళ్లు గడిచిపోయింది. ఏ ఒక్క హామీ నేరవెర్చకపోవడం దుర్మార్గమని శ్రీకాంత్ రెడ్డి టీడీపీ సర్కార్ పై  విరుచుకుపడ్డారు.  

టర్మినేటర్ సినిమా మాదిరి పోస్టర్ లు ఎటాచ్ చేసి ఇదే రాజధాని అని మాట్లాడుతునారు.  ఇంకెంత కాలం ప్రజలను మభ్యపెడుతారు. ఒబామా, సత్యనాదెళ్ల, బిల్ గేట్ అంతా నావల్లే ఎదిగారని బాబు మాట్లాడుతున్నాడు. మరి అంత చేసిన మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు ఎందుకు అమలు చేయడం లేదని శ్రీకాంత్ రెడ్డి బాబుకు చురక అంటించారు. ఎంతసేపు వైయస్సార్సీపీపై ఎదురుదాడి చేయడమే పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.  ప్రతిపక్ష నాయకునిపై వాడే నీచ బాషను మానుకోవాలని మంత్రులకు హితవు పలికారు. సైకో, గజదొంగ, ఉన్మాది అంటూ టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారు. ప్రతిపక్షానికి సంస్కారం లేదని ఎదురుదాడి చేస్తారు.  ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే కేసులు పెడుతున్నారు. బెదిరిస్తున్నారు. రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకెళుతున్నారు. రాబోయే సమావేశాల్లోనైనా 
అసెంబ్లీ గౌరవాన్ని పెంచాలని  శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి హితబోధ చేశారు. సభను సజావుగా నడిపించి ప్రతిపక్షం సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేగానీ తప్పుు మీరు చేస్తూ ఇతరులపై నెట్టే విధానాన్ని మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ దోపిడీ, అవినీతికి మాత్రమే వైయస్సార్సీపీ వ్యతిరేకమని, అభివృద్ధికి బేషరతుగా సపోర్ట్ చేస్తుందని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీరు ఏమీ చేయలేక  ప్రతిపక్షంపై నిందలు మోపితే ఎలా అని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అధికారం ఉంది కదా అని పోలీసులు, మహిళలు, అధికారులను అందరినీ హింసిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని సూచించారు.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నారు. 
Back to Top