ప్రత్యేకహోదా కోరుతూ రిలేదీక్షలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఉద్యమం మరింత ఉధృతం చేసింది. తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపుమేరకు పోరును తీవ్రతరం చేశారు.  హోదాని సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నేటి నుంచి 21వరకు ఈదీక్షలు కొనసాగుతాయి. 

అదేవిధంగా రోజువారి పోరాటాల్లో భాగంగా 18 వ తేదీన ర్యాలీల చేపడుతారు. అనంతరం సమావేశాలు నిర్వహిస్తారు. 19 న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, 20 న మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. 21 వ తేదీన ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు చేపడతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేవరకు పోరు ఆగదని వైఎస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. అప్పటివరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తేల్చిచెబుతున్నారు.
Back to Top