ప్రతిపక్ష నేతగా బాబు విఫలం: భూమన

తిరుపతి:

ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ప్రతిపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విఫలమయ్యారని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాబాట సందర్భంగా ఆయన రాజీవ్‌నగర్ పంచాయతీ సాయినగర్‌లో తిరిగారు. ధరలు పెంచి ప్రజలను ప్రభుత్వం ఇబ్బందిపెడుతున్నప్పటికీ చంద్రబాబు పట్టనట్టు ఉన్నారని మండిపడ్డారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలతో కలసి పోరాడాల్సిన చంద్రబాబు అధికారపార్టీతో కుమ్మకై  వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్  జగన్మోహన్‌ రెడ్డిపై కుట్రలు, కుంత్రాలు పన్నుతున్నారన్నారు. తిరుపతి నగర ప్రజల సమస్యలపై నిరంతరం ప్రభుత్వంతో తాను పోరాడుతున్నా పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రజలకు కష్టాల నుంచి విముక్తి లభిస్త్తుందని తెలిపారు.

Back to Top