ప్రతి ఇంట్లో వైయస్ వెలుగులు

హైదరాబాద్:

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రతీ పేదవాడి ఇంట్లో వెలుగులు నింపారని మాజీ ఐఏఎస్ అధికారి, 2009లో పీఆర్పీ తరఫున తిరుపతి పార్లమెంట్‌కు పోటీచేసిన ఎం.  వరప్రసాద్ చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో వరప్రసాద్, ఆయన అనుచరులు పార్టీలో చేరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పేద ప్రజలు వైయస్ హయాంలో లబ్ధి పొందినంతగా రాష్ట్ర చరిత్రలో మరెప్పుడూ లబ్ధి పొందలేదన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకం పేద ప్రజలను దష్టిలో పెట్టుకొనే రూపొందించారన్నారు. రైతులకు వైయస్ చేసిన కృషిని చూస్తే.. వారి కోసమే ఆయన జన్మించారనేలా తోడ్పాటునందించారన్నారు. రైతు రుణమాఫీ ద్వారా రాష్ట్రంలో 80 లక్షల మందికి 12 వేల కోట్ల రూపాయలు అందించగలిగారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వై.వి. సుబ్బారెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top