ప్రత్యేక హో దా కోసం కళ్లు తెరిపించే రీతిలో ఉద్యమం -వైఎస్ జగన్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం దిగి రాకపోతే తమ పార్టీ తరపున ఏడుగురు ఎంపీలు, 67 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా లో రైతు భరోసా యాత్ర సందర్భంగా మడకశిర నియోజక వర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదట నుంచి ఉద్యమిస్తున్నది వైఎస్సార్సీపీ అని ఆయన అన్నారు. కేంద్రప్రభుత్వం, చంద్రబాబుల కళ్లు తెరిపించేలా ఉద్యమిస్తామని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఏ నాడు ప్రతిపక్ష పాత్ర పోషించలేదని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబుదంతా మోసాల చరిత్ర

అంతకుముందు పీసీ గిరి ప్రాంతంలో వైఎస్ జగన్ బీడు భూముల్ని పరిశీలించారు. రైతుల రుణాలు మాఫీ కాలేదని, దీంతో రైతులపై అపరాధ వడ్డీలు పడుతున్నాయని ఆయన అన్నారు. ఒకప్పుడు పావలా వడ్డీ  చెల్లించే రైతులు ఇప్పుడు 14శాతం వడ్డీ కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు. కరువు కాటకాల్ని తట్టుకోలేక రైతులు, కూలీలు బెంగళూరుకు వలస వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top