రామయపట్నం పోర్టుతో ప్ర‌కాశం జిల్లా అభివృద్ధి

న్యూఢిల్లీ : ప‍్రకాశం జిల్లా రామయపట్నంలో మేజర్‌ పోర్టు ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం లోక్‌ సభలో ఆయ‌న రామ‌య్య‌ప‌ట్నం పోర్టు ఏర్పాటు చేయాల‌ని కోరారు.  ఎంపీ మాట్లాడుతూ దుగ్గరాజుపట్నం పోర్టు సాధ్యం కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చేశాయన్నారు. పోర్టు కం షిప్‌యార్డు ఏర్పాటుకు రామయపట్నం ఉత్తమమని నిపుణుల కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు.

Back to Top