పెద‌కూర‌పాడుకు అన్నొచ్చాడు

- గుంటూరు జిల్లాలో విజ‌య‌వంతంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- రాజన్న బిడ్డకు ఘన స్వాగతం
–దారిపొడవునా జననేతపై పూలవర్షం
– మధ్యాహ్నం పెదకూరపాడులో బహిరంగ సభ
గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు గ‌తేడాది న‌వంబ‌ర్ 6న వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి అయ్యింది. ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించింది. 123వ రోజు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర గురువారం ఉదయం గుంటూరు జిల్లా గుడిపూడి శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి పెదమక్కెన, పెదకూరపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. అనంతరం పెదకూరపాడులో జరగబోయే బహిరంగసభలో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు.

పాద‌యాత్ర‌ రోడ్లన్నీ జన ప్రభంజనమే
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌వేశించిన వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. తన గడపలో అడుగుపెట్టిన జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉప్పెనలా తరలివచ్చిన ప్రజలతో ఘన స్వాగతం పలికింది. ఆయన పట్టుదలకు, కార్యదీక్షకు సలాం చేసింది. మండుటెండను లెక్కచేయక  వెల్లువలా తరలివచ్చారు. పాద‌యాత్ర‌ రోడ్లన్నీ జన ప్రభంజనంతో కిటకిటలాడాయి. రాష్ట్రంలో నెలకొన్న దుర్మార్గపు పాలనపై ప్ర‌జ‌లు  వైయ‌స్‌ జగన్‌కు వివ‌రిస్తున్నారు.  మహిళలు, యువత, పిల్లలు పెద్ద ఎత్తున తరలివచ్చి రాజ‌న్న బిడ్డ‌ను క‌లుస్తున్నారు. జననేత ను చూడగానే ‘మీకే ఓటు వేస్తాం...మీరే గెలవాలి’ అంటూ నినదించారు. జ‌న‌నేత‌తో సెల్ఫీలు దిగి మురిసిపోయారు. ప్రత్యేక హోదా రావాలంటే జగనన్నను సీఎం చేయాల్సిందే అంటూ పాదయాత్ర పొడవునా యువత నినాదాలతో హోరెత్తించింది. దారి పొడవునా మహిళలు పూల వర్షం కురిపిస్తూ హారతులు ఇస్తూ స్వాగతం పలికారు.  
Back to Top