శ్రీకాళహస్తిలోకి ప్రజా సంకల్ప యాత్ర

 
చిత్తూరు -   అధికార పార్టీ నేతల విచ్చలవిడి అవినీతి కారణంగా 17 మంది అమాయకుల ప్రాణాలు బలికొన్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత బియ్యపు మధుసూదన్‌ రెడ్డి మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇవాళ చిత్తూరు జిల్లా ఆర్‌వీ కండ్రిగ వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా  ఆర్‌వీ కండ్రీగ వద్ద వైయస్‌ జగన్‌కు పార్టీ నేతలు బియ్యం మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ..జిల్లాకు చెందిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అవినీతికి అంతే లేకుండా పోయిందన్నారు.  మాజీ మంత్రి కనుసన్నలో ఇసుక దోపిడీ జరుగుతుందని ఆరోపించారు.  ఇసుక మాఫియా కారణంగా 17 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారని విమర్శించారు. చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ కుటుంబాలకు ఆర్థికసాయం చేసి ఆదుకున్నారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తుందని, వేలాది మంది జనాలు పాల్గొని వైయస్‌ జగన్‌ను ఆశీర్వదిస్తున్నారన్నారు. టెంపుల్‌ సిటీలో సమస్యలు తిష్ట వేశాయన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే నియోజకవర్గంలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top