<strong>నియోజకవర్గాల్లో కొనసాగుతున్న రావాలి జగన్–కావాలి జగన్</strong>రాష్టవ్యాప్తంగా నియోజకవర్గాల్లో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి నవరత్నాల పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పిస్తున్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు, వైయస్‌ఆర్‌సీపీ నేతలు జననేత వైయస్ జగన్ చేపట్టబోయే సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తున్నారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో నిర్వహించిన కావాలి జగన్–రావాలి జగన్ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు వీసం రామకృష్ణ, గొల్ల బాబూరావు,బొల్లిశెట్టి గోవింద్, లోడగల చంద్రరావు, పొడగట్ల పాపారావు, సురకాసుల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. నిడమ్రరు మండలం క్రోవిడిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉంగుటూరు సమన్వయకర్త వుప్పాల వాసుబాబు,మండల కన్వీనర్ సంకు సత్యకుమార్, ధనుకొండ బుజ్జి, నల్లజర్ల మండలం ప్రకాశ్‌రావుపాలెం తదితరులు పాల్గొన్నారు. బీసీ కాలనీలో నిర్వహించిన రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి కొలుసు పార్థసారధి,అప్పారావు, మద్దాల రామచంద్రరావు,కోనేరు అచ్చయ్య పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా రామ సముద్రం మండలం మట్టివారి పల్లిలో మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు 12వ వార్డులో ఎమ్మెల్యే రాచముల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.