ప్రజల నడుమ ఆవిర్భావ దినోత్సవం ఆనందదాయకం

చిలకలూరిపేట, 12 మార్చి 2013:

గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గంలోని చిరుమామిళ్ళలో శ్రీమతి వైయస్ షర్మిల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కేక్ కోశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర వైయస్ఆర్ సీపీకి బంగారు భవిష్యత్తు ఉందని ఆమె చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాలను ఆమె ఆవిష్కరించారు. ఆవిర్భావ దినాన ప్రజల మధ్య ఉండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైయస్ఆర్ సీపీ విజయాల వెనుక జగనన్న కృషి ఎంతో ఉందని ఆమె తెలిపారు. జగనన్న కచ్చితంగా సీఎం అవుతారని స్పష్టం చేశారు.

Back to Top