ప్రజల హృదయాల్లో వైయస్‌ఆర్‌కు సుస్థిర స్థానం

బొబ్బిలి: ప్రజల హృదయాల్లో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిది సుస్థిర స్థానమని, దానిని ఎవరూ చెరిపేయలేరని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. రామభద్రపురం మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో బుధవారం జరిగిన బహిరంగ సభలో పెనుమత్స మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలు మహానేత వైయస్‌ఆర్ అమలు చేశారన్నారు. మహానేత మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ వైయస్‌ఆర్ కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ నెల 5న జగన్ జైలు నుంచి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రోజు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలంతా జగన్ కోసం పూజలు చేయాలని పిలుపునిచ్చారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పాలకులు నీరుగార్చుతున్నారని చెప్పారు. 2014లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ బేబీనాయన మాట్లాడుతూ రామభద్రపురం సభకు తరలివచ్చిన వేలాది మంది ప్రజలను చూస్తుంటే బొబ్బిలి యుద్దంలో ప్రజల పోరాటం గుర్తుకు వస్తుందన్నారు. 

2500 కుటుంబాల చే రిక
ఈ సందర్భంగా రామభద్రపురం మండలంలో 18 గ్రామాల నుంచి 2500 కుటుంబాలు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను వీడి వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరాయి. వీరికి పెనుమత్స, సుజయ్‌కృష్ణ రంగారావు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. రామభద్రపురం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, కూరాకుల వీధి, ఆరికతోట, నాయుడువలస, తారాపురం, నర్సాపురం, గొల్లలపేట, మిర్తివలస, వంగపండువలస, రొంపల్లివలస తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో చేరారు. చేరిన వారిలో టీడీపీకి చెందిన ఆకుల చిన్నంనాయుడు, పూసర్ల పెదబాబు, బుగత రాము, కాంగ్రెస్‌కు చెందిన పొట్టంగి గురునాయుడు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చింతల రామకృష్ణ, మడక తిరుపతినాయుడు, కర్రోతు తిరుపతిరావు, మామిడి చిన్నమ్మతల్లి, డబ్ల్యూ ఏ రాములు, కిర్ల అప్పలరాంనాయుడు, బోయిన లూర్థనమ్మ, జొన్నాడ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

జగన్ త్వరలోనే జైలు నుంచి వస్తారు
భోగాపురం: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు చెప్పారు. ఆ పార్టీ నాయకుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు  ఇక్కడకు వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో అభిమానులనుద్దేశించి మాట్లాడారు. జగన్‌పై అక్రమ కేసులు బనాయించి బెయిల్ రాకుండా అడ్డుపడుతున్న కుట్ర పూరిత రాజకీయాలు తుడిచిపెట్టుకుపో యే రోజులు రానున్నాయన్నారు. కోర్టు తీర్పు తో కడిగిన ముత్యంలా జగన్ త్వరలోనే ప్రజల ముందుకు రానున్నారని చెప్పారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు జన్మదిన వేడుకలు ఆ పార్టీ కార్యాలయంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రెండు వేల మంది వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 

Back to Top