ప్రజాసమస్యలను గాలికి వదిలిన ప్రభుత్వం!

ఉరవకొండ

4 నవంబర్ 2012 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని షర్మిల విమర్శించారు. కిరణ్, చంద్రబాబు ఎంత అధ్వానంగా ఉన్నారో అధికారులూ అలాగే తయారయ్యారని ఆమె అన్నారు.  అనంతపురం జిల్లా ఉరవకొండలో పాదయాత్ర చేస్తున్న షర్మిలను ఆదివారం గాలిమరల సర్కిల్ వద్ద కొందరు గొర్రెల కాపర్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గొర్రెలకు జబ్బు చేస్తే మందులిచ్చే నాథుడు లేడని వారు వాపోయారు. వైయస్ఆర్ ఉన్న రోజుల్లో కార్పొరేషన్ ద్వారా తమకు లబ్ధి చేకూరేదని గుర్తు చేశారు. వైయస్ ఉన్నప్పుడు పంట రాకపోయినా బీమా వస్తుందన్న ధీమా ఉండేదని గుర్తు చేసుకున్నారు. గొర్రెల కాపరులు షర్మిలకు ఒక గొర్రెపిల్లను అభిమానంగా బహూకరించారు. ఆమె దానిని ఆప్యాయంగా ఎత్తుకున్నారు. షర్మిల 18 వ రోజు పాదయాత్ర నిరాఘాటంగా కొనసాగుతోంది. టిడిపికి నేత పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉరవకొండ నియోజకవర్గంలో వేలాది మంది ప్రజలు షర్మిలతో కలిసి నడుస్తున్నారు.

Back to Top