కూరుపాం నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న ప్రజా సంకల్పయాత్ర

విజయనగరంః ప్రజా సంకల్పయాత్ర మధ్యాహ్నం తర్వాత కూరుపాం నియోజకవర్గంలోకి అడుగుపెట్టబోతుంది. వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే పుష్ఫ శ్రీవాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. జననేత కోసం కూరుపాం నియోజకవర్గం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే పుష్ఫ శ్రీవాణి అన్నారు.తమ సమస్యలు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి చెప్పుకోవాలని ప్రజలు ఆశతో ఉన్నారన్నారు. తోటపల్లి ప్రాజెక్టు అని పేరు చెప్పగానే గుర్తుకువచ్చే నాయకుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని అన్నారు.  కూరుపాం నియోజకవర్గంలో గరుగుమిల్లి నుంచి తోటపల్లి బ్యారేజీ మీదగా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. తోట రిజర్వాయర్‌తో ఎంతోమంది రైతులు లబ్ధిపొందారనే అంశాలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఇంకా అధిక మంది రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనాలు కలిగించాలని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.
Back to Top