ప్రభుత్వానికి పెద్ద మనసు లేదు: షర్మిల


చిత్రావతి:

రాజన్న కుటుంబానికి ఉన్న పెద్ద మనసు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు లేదని షర్మిల చెప్పారు. అనంతపురం జిల్లలోని చిత్రావతి డ్యామ్‌ను ఆమె మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. డ్యామ్ పనుల తీరుపై ఆమె మండిపడ్డారు. త్వరగా పూర్తిచేసి రైతులకు సాగు నీరందించాలని ఆమె కోరారు. డ్యామ్‌ నిర్మాణం పనులు జరుగుతున్న తీరుపై అధికారులను షర్మిల నిలదీశారు. రైతులంటే ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు ఉందో డ్యామ్‌ పనుల్ని చూస్తే అర్థమవుతుందని ఆమె అన్నారు. కష్టకాలంలో ప్రజలంతా ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. త్వరలోనే జగన్‌ బయటకు వస్తారని కష్టాలతో తల్లడిల్లుతున్న జనానికి అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు. కడప జిల్లా పర్యటన ముగించుకున్న షర్మిల చిత్రావతి మీదుగా అనంతపురం జిల్లాలో ప్రవేశించారు. వైయస్ఆర్ కుటుంబానికి ఉన్న పెద్ద మనసు ప్రభుత్వానికి లేదనీ, అందుకు సాగుతున్న పనులే ఉదాహరణని ఆమె పేర్కొన్నారు. చిత్రావతి వద్ద స్థానికులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అండగా నిలవాల్సిన అధికారులు అదే ధోరణితో ఉన్నారని షర్మిల అన్నారు.

Back to Top