ప్రభంజనంలో అంతా గల్లంతవుతారు

ఆత్మకూర్:

ప్రస్తుతం వీస్తున్నది శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రభంజనమనీ, దాని ముందు కేసీఆర్, చంద్రబాబు ఎత్తుగడలు కొట్టుకుపోవడం ఖాయమనీ వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యులు ఆది శ్రీనివాస్, అమరచింత మాజీ ఎమ్మెల్యే స్వర్ణమ్మ, పార్టీ జిల్లా అడ్‌హాక్ కమిటీ సభ్యులు వర్కటం జగన్నాథ్‌రెడ్డి, మూలమళ్ల వినయ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ ఎదుగుతుండటంతో జీర్ణించుకోలేని ఆ  నాయకులు అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మకూరులో షర్మిల పాదయాత్ర ఏర్పాట్లను  పరిశీలించిన సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. శ్రీ జగన్మోహన్‌ రెడ్డిని కుట్రపూరితంగా జైలులో పెట్టి బెయిల్ రానివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ అధినేత సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ పాదయాత్రతో రాజన్నరాజ్యం వస్తుందనే భరోసా ప్రజల్లో కలుగుతుందన్నారు.

Back to Top