టీడీపీ కార్యాలయాలుగా పోలీసు స్టేషన్లు

అనంతపురం:  రాష్ట్రంలో పోలీసు స్టేషన్లు టీడీపీ కార్యాలయాలుగా మారాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు విచాక్షణారహితంగా కొట్టడంతో గాయపడిన వారిని బుధవారం వైయస్‌ఆర్‌సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలకు పోలీసులు తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగల నెపంతో వైయస్‌ఆర్‌సీపీ నేతలపై దాడులకు పాల్పడటం దారుణమన్నారు.  విచారణ సమయంలో పోలీసు స్టేషన్లోనే టీడీపీ నేతలకు కూర్చిలు వేసి కూర్చోబెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులను పోలీసులు కొట్టడం దుర్మార్గమన్నారు. ఎవరో ఆటోకు నిప్పుపెడితే వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం సరికాదన్నారు. తీరు మార్చుకోకపోతే ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
Back to Top