పోలీసుల అత్యుత్సాహం

ఏర్పేడు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బ్యానర్లు, ప్లెక్లీలు, కటౌట్‌లు తొలగించడంపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మండలంలోని ఇసుకతాగేలి, అంజిమేడు, ఏర్పేడు, మేర్లపాక, మన్నసముద్రం తదితర గ్రామాల వద్ద పూతలపట్టు–నాయుడుపేట రోడ్డు పక్కన వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు తమ పార్టీలకు చెందిన బ్యానర్లు, ప్లెక్లీలు, కటౌట్‌లను ఏర్పాటు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో ఎన్నికల కోడ్‌ సాకుతో పోలీసులే స్వయంగా ఇసుకతాగేలి, అంజిమేడు, ఏర్పేడు, మేర్లపాక, మనసముద్రం గ్రామాల వద్ద ఉన్న వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ బ్యానర్లు, ప్లెక్లీలు, కటౌట్‌లను తొలగించారు. ఈ ప్రాంతాలలో ఉన్న టీడీపీ బ్యానర్లు, ప్లెక్లీలను తొలగించలేదు. అధికార పార్టీ ఆదేశాల మేరకే ఆ పార్టీలకు చెందిన బ్యానర్లు, ప్లెక్లీలు తొలగించలేదని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ మండల అద్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తల నాగభూషణ నాయుడు, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు అర్జున్‌బాబు, ఎంపీటీసీ చెంబేటి మునిరత్నంరెడ్డి, కూనాటి రమణయ్య యాదవ్, తిరుపతి జనార్ధన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో అన్నారు.

Back to Top