- చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు
- హిట్లర్ పాలనలో కూడా మహిళలకు ఇంత అవమానం జరగలేదు
- వైయస్సార్‌సీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి: ప‌్రత్యేక హోదా కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని వైయస్సార్‌సీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్సార్‌సీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు, ప్రజలు, పలు సంఘాల నాయకులు స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నా... వారిని దేశంలో కనివిని ఎరుగని విధంగా పోలీసులు లాఠీచార్జీ చేయడం చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమన్నారు. కాగా భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
* ప్రజాస్వామ్య వాదుల పట్ల పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటు
* మహిళా కార్యకర్తల చీరలు లాగుతూ... జాకెట్లు చించి, విచక్షణ రహితంగా లాఠీలను ఝుళిపించడం హేయమైన చర్య
* బహుశా హిట్లర్ పాలనలో కూడా మహిళలపై ఇంత ఆరాచకంగా ప్రవర్తించలేదు
* నిర్భయ కన్నా దారుణమైన రీతిలో మహిళలపై పోలీసులు విరుచుకు పడ్డారు
* ప్రత్యేక హోదా కోసం తమ ప్రాణాలైనా ఇస్తామంటూ మహిళా కార్యకర్తలు చేసిన నినాదాలు ఉద్యమానికి మరింత ఊపునిస్తున్నాయి
* బాబు తన కొడుకును రాజకీయంగా పైకి తీసుకురావడం కోసమే ఇంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారు.
* భారతదేశంలో ఇంత నీచరాజకీయం చేస్తుంది ఒక్క చంద్రబాబే...
* ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి డిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశారు.
* రాష్ట్రంలో కలెక్టరేట్, మండల కార్యాలయాల వద్ద వైయస్సార్సీపీ ఎన్నోసార్లు ఆందోళనలు నిర్వహించి, ప్రజలను చైతన్యవంతం చేసింది.
* చంద్రబాబు ఏమి సాధించారని ఇంత నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు
* ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు.
* తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యేక హోదాను బీజేపీ 10 సంవత్సరాలు ఇస్తామని మోడీ అంటే.. 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు అడిగారు
* బీజేపీ, టీడీపీ ప్రజలను మోసం చేశాయి.