ఫిబ్రవరిలో ‘వైయస్ఆర్ విద్యుత్తు ఉద్యోగ’ సదస్సు

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్తు ఉద్యోగుల సంఘం (హెచ్-128) రాష్ట్ర స్థాయి సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహిస్తారు. వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి. జనక్‌ప్రసాద్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనియన్ ముఖ్యనేతల సమావేశం శుక్రవారం తొలిసారిగా ఏర్పాటైంది. పలు జిల్లాల నుంచి విద్యుత్తు ఉద్యోగుల సంఘం నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆచరణ సాధ్యమైన డిమాండ్లనే యాజమాన్యాల ముందు పెట్టాలని సమావేశం అభిప్రాయపడింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top