మేము సైతం.. పోరుకు సిద్ధం

* రాష్ట్ర‌మంత‌టా ఇదే మాట‌
* ప్ర‌త్యేక హోదా వ‌స్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది
* చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా నోరు తెర‌వాలి
* ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే టీడీపీ ఎంపీలూ రాజీనామా చేయాలి
* హోదా కోసం పోరాడుతున్న‌ది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీనే
* ఏపీ ప్ర‌జ‌ల  అభిప్రాయం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: `` నాడు ఎన్నిక‌ల ముందు తిరుప‌తి వెంక‌న్న సాక్షిగి ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని అప్ప‌టి ప్ర‌ధాని అభ్య‌ర్థి న‌రేంద్ర మోడీ చెప్పారు. ఏపీకి 15 ఏళ్లు ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెప్పారు. వాళ్లిద్ద‌రూ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు అవుతున్నా ప్ర‌త్యేక హోదా మాత్రం రాలేదు. ఈ ప్ర‌భుత్వాల‌పై పోరాటం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. హోదా కోసం మొద‌టి నుంచి పోరాడుతున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంటే మేమూ న‌డుస్తాం. ప్ర‌త్యేక హోదా సాధించుకుంటాం`` అని రాష్ట్ర ప్ర‌జ‌లు ఉద్య‌మాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. మార్చి 5 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ పార్ల‌మెంట్‌లో పోరాడుతామ‌ని, అయినా ఇవ్వ‌క‌పోతే ఏప్రిల్ 6న త‌మ పార్టీ ఎంపీల‌తో రాజీనామా చేయిస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని తామూ స్వాగ‌తిస్తామ‌ని అంటున్నారు. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అని, ఈ హ‌క్కును సాధించుకోవాల్సిన  అవ‌స‌రం అంద‌రిపై ఉంద‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు పిలుపునిస్తున్నారు. రైతులు, మ‌హిళ‌లు, విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని రాజ‌కీయా పార్టీలు క‌లిసి  రావాల‌ని అంటున్నారు. మాట ఇస్తే ఆ మాట‌కు క‌ట్టుబ‌డే వ్య‌క్తి వైయ‌స్‌జ‌గ‌న్ అంటున్నారు. హోదా ఇవ్వ‌క‌పోతే రాష్ట్రం మొత్తం ఏపీ వైపు చూసేలా ఉద్య‌మాలు చేస్తామ‌ని, త‌మ పార్టీ ఎంపీల‌తో రాజీనామా చేయిస్తాన‌ని గ‌తంలో చెప్పిన‌ట్లుగానే వైయ‌స్ జ‌గ‌న్ ఇప్పుడు సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం హ‌ర్ష‌నీయ‌మంటున్నారు. టీడీపీ నాలుగేళ్లుగా పార్ల‌మెంట్‌లో టైంపాస్ చేసి ఇప్పుడు ఏదో సాధించేసిన‌ట్లు ఎంపీల‌కు స‌న్మానాలు చేయ‌డం సిగ్గుచేట‌న్నారు. ప్ర‌భుత్వంలో ఉంటూ పోరాడాల్సిన చంద్ర‌బాబు మౌనం పాటించ‌డం వెనుక ఉన్న మ‌త‌ల‌బు ఏంటో చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. క‌నీసం ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు మౌనం వీడి ప్ర‌త్యేక హోదా పోరాడాల‌న్నారు. అంద‌రం క‌లిసి పోరాటం చేస్తూ హోదా సాధించుకోవ‌డం పెద్ద విష‌య‌మేమీ కాదంటున్నారు. 
Back to Top