అందరికీ అండగా సంక‌ల్ప యాత్ర‌


- ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
-  సాయంత్రం చీరాలలో బహిరంగ సభ 
- ఇప్పటి వరకు 1,449.5 కిమీ నడిచిన వైయ‌స్‌ జగన్‌

ప్రకాశం: చ‌ంద్ర‌బాబు పాల‌న‌లో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి వందల మైళ్లు దాటి నడచి వస్తున్న వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డికి పల్లెలన్నీ ఎదురొచ్చి స్వాగతిస్తున్నాయి.మహానేత పాలనలో స్వర్ణయుగాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజానీకం ఆయన వారసుడి నేత్వత్వం కావాలని ఆకాంక్షిస్తోంది. వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం వేటపాలెం శివారు నుంచి వైయ‌స్‌ జగన్‌ 108వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి అంబేద్కర్‌ నగర్‌, దేశాయిపేట, జండ్రపేటకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ‍్నం 02.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. రామకృష్ణాపురం మీదుగా చీరాల వరకు పాదయాత్ర కొనసాగుతుంది. చీరాల పట్టణంలో క్లాక్‌ టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగం సభలో వైయ‌స్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇప్పటి వరకు వైయ‌స్ జగన్ 1,449.5 కిలోమీటర్లు నడిచారు. ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నా అనే భరోస్తా ఇస్తూ రాజన్న బిడ్డ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

నాలుగేళ్లుగా ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకుంటూ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కలసి పల్లె జనం ఆత్మీయతతో కూడిన అడుగులు వేస్తున్నారు. పల్లెపల్లెలోనూ ఆడపడుచులు హారతిపట్టి స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజల సమస్యలు వింటూ.. అందరికీ అండగా ఉంటానని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. జనాభిమానమే తోడుగా పాదయాత్ర కొన‌సాగుతోంది. యాత్ర ప్రారంభం వైయ‌స్ నుంచే జగన్‌మోహన్‌ రెడ్డి కోసం ప్రజలు ఎదురుచూస్తూ ఆయనకు తమ కష్టాలు చెప్పుకోవటానికి బారులు తీరుతున్నారు. పేద ప్రజలకు ఆశ, శ్వాస నువ్వేనంటూ ఆయనతో తమ మనసులో ఉన్న ప్రేమను వెలిబుచ్చుతున్నారు. యాత్రలో వైయ‌స్ జగన్‌ నడుస్తుంటే పొలాల్లో ఉన్న కూలీలు తమ అభిమాన నాయకుడిని చూసి తమ గోడు చెప్పుకోవడానికి పెద్ద గుట్టలు సైతం ఎక్కి పరుగులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేసిందని ఎంతోమంది మెరుగైనవైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని తెలుపుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని.. హోదా ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజాసంకల్పయాత్రలో యువ‌కులు ప్లకార్డులు పట్టుకుని  మద్దతు తెలుపుతున్నారు.  ఇవాళ సాయంత్రం చీరాల ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన బహిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ప్ర‌సంగిస్తారు. 

Back to Top