- జననేత కోసం ఎదురుచూస్తున్న జనం- రాజన్న బిడ్డ వస్తున్నాడని ఎదురెళ్లి స్వాగతం- వైయస్ జగన్ పాదయాత్రకు తండోపతండాలు కదిలివస్తున్న ప్రజలు
కర్నూలు: ప‌్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రగా బయలుదేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. తమ బాధలు చెప్పుకోవాలని తహతహలాడుతున్నారు. ఎప్పుడు మా ఊరికి వస్తాడా అని నిరీక్షిస్తున్నారు. జననేతకు ఎదురెళ్లి ఘన స్వాగతం పలుకుతూ అడుగడుగున కన్నీటి గాథలు చెప్పుకుంటున్నారు. నాలుగేళ్ళుగా ప్రభుత్వం చుట్టూ తిరిగినా ఫలితం దక్కని వాళ్లు.. కన్నీటి పర్యంతమైనా కనికరమే చూపని అధికారులతో విసిగిపోయిన వాళ్లూ.. ప్రతిపక్ష నేతకు తమ గోడు చెప్పుకుంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ నెల 6వ తేదీ వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో జననేత పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజల కష్టమేంటో తెలుసుకుంటున్నారు. ఇంటిపెద్దలా అందరినీ ఓదారుస్తున్నారు. ధైర్యంగా ఉండాలంటూ భరోసా ఇస్తున్నారు. తమ అభిమాన నేత తమ దగ్గరకే వచ్చి, తమ కష్టాలు ఆలకించడంతో వారు ఒకింత ఊరట పొందుతున్నారు.
పనులు మానుకొని..వైయస్ జగన్ మోహన్ రెడ్డి తమ గ్రామానికి వస్తున్నారన్న సమాచారంతో రైతు కూలీలు, వివిధ వృత్తులు చేసే వారు, ఉద్యోగులు పనులు మానుకొని ఎదురు చూస్తున్నారు. జననేత రాగానే అదిగో జగనన్న అంటూ జేజేలు కొడుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ నినదిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు నాయనా నీవే మా కష్టాలు తీర్చాలని మొరపెట్టుకుంటున్నారు. అన్నదాతలు తమ గోడు చెప్పుకుంటూ అన్నా..మీరే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రోజు కూలీ మొదలుకొని, ఉద్యోగ, వ్యాపార వర్గాల మనసు తట్టే విధంగా వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. రైతన్నతో అడుగులో అడుగేస్తూ ముందుకు కదిలినా... డ్వాక్రా అక్కచెల్లెమ్మలతో చేతులూపుతూ బాధలు పంచుకుంటూ సాగిపోయినా... వైయస్ జగన్ కన్నీటి కష్టాలు తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నారు.
విశేష స్పందనవైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు కర్నూలు జిల్లాలో విశేషమైన స్పందన లభిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య పేర్కొంటున్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల భరత్‌కుమార్‌రెడ్డితో కలసి ప్రజా సంకల్ప పాదయాత్ర వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాదయాత్రలో రైతులు, మహిళలు, రైతు కూలీలు, వృద్ధులు, యువకులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, చిరుద్యోగులు భారీగా తరలివచ్చి తమ బాధలను చెప్పుకొని ఉపశమనం పొందుతున్నారన్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ జననేత ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను ఎంతో ఓపికతో అడిగి తెలుసుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసేందుకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తారన్నారు. పాదయాత్ర జిల్లాలో వచ్చే నెల 4 వ తేదీ వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. people-support-ys-jagan-praja-sankalpa-yatraPrajaSankalpaYatraPraja Sankalpa YatraYS Jagan padayatra