ఆత్మీయ యాత్ర- ప‌ల్లెల్లో పండుగ వాతావ‌ర‌ణం
- వెల్లువెత్తుతున్న స‌మ‌స్య‌లు

చిత్తూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. న‌వంబ‌ర్ 6న ప్రారంభ‌మైన జ‌న‌నేత పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. దారిపొడువునా ప్ర‌జ‌లు త‌మ బాధ‌లు ప్ర‌తిప‌క్ష నేత‌కు వివ‌రిస్తున్నారు. వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి చేసుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ ఈ నెల 28న చిత్తూరు జిల్లాలోకి ప్ర‌వేశించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా 47వ రోజు  చిత్తూరు జిల్లా వసంతపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి ఉప్పులురువాండ్లపల్లికు చేరుకున్నారు. గ్రామంలో వైయ‌స్ జగన్‌కు ఘన స్వాగతం ల‌భించింది. అనంత‌రం గ్రామంలో పార్టీ జెండాను ఎగుర వేశారు. అక్క‌డి నుంచి పాద‌యాత్ర జి.కొత్తపల్లి క్రాస్‌, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. స్థానికులు వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆప్యాయంగా పలకరించారు.  రాజన్న బిడ్డ తొలిసారి తమ ఊర్లోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఉప్పులూరువాండ్ల‌ప‌ల్లి గ్రామ‌స్తులు ఉప్పొంగిపోయారు. జ‌న‌నేత రాక‌తో ప‌ల్లెల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. వీధుల‌న్నీ కూడా పార్టీ జెండాల‌తో క‌ల‌క‌ల‌లాడుతున్నాయి. జ‌నం ప‌నులు మానుకొని వైయ‌స్ జ‌గ‌న్ కోసం వేచి చూస్తున్నారు.

అన్నా..మీరే ఆదుకోవాలి
అన్నా.. స‌కాలంలో వర్షాలు కుర‌వ‌క‌, సాగునీరు అంద‌క వ్య‌వ‌సాయం భార‌మ‌వుతుంద‌ని, ఊర్ల‌లో ఉపాధి లేద‌ని రైతులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అందరికీ పొలాలున్నాయి. కానీ సేద్యం చేసుకునే పరిస్థితి లేదు. పొలంలో బోరుబావులున్నా.. అధికారులు త్రీపేజ్‌ కరెంట్‌ ఇవ్వడం లేదు. గ్రామంలో అందరూ చదువుకున్నోళ్లున్నా చేతినిండా పనిదొరకడంలేదు. మీరే ఆదుకోవాలన్నా..’ అంటూ ఉప్పులూరువాండ్ల‌ప‌ల్లె గ్రామస్తులు తమ సమస్యలను వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు.  వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాదిలో మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని ధైర్యం చెప్పారు. యుద్ధ‌ప్రాతిపాదిక‌న ప్రాజెక్టులు పూర్తి చేస్తాన‌ని, పెట్టుబ‌డుల కోసం ప్ర‌తి ఏటా మే నెల‌లో రూ.12,500 ప్ర‌తి రైతుకు ఇస్తాన‌ని, పెట్టుబ‌డి నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధ‌ర‌లు క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో అన్న‌దాత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top