<br/><strong>వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్..</strong><br/><strong>శ్రీకాకుళంః </strong>టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్ అన్నారు.స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేరని, నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. కనీస సౌకర్యాలకు కూడా ప్రజలు నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు.వైయస్ జగన్ సీఎం అయితేనే తమకు మంచి జరుగుతుందని,మళ్లీ సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. వైయస్ జగన్ ప్రసంగం వినాలని ప్రజలు ఆసక్తిగా ఉన్నారన్నారు.నారాయణ సాగర్ ఆయకట్టు కింద కొన్ని వేల ఎకరాలు ఉన్నాయని, ఆధునీకరణ పనులు పూర్తిచేసి రైతులను నీరు అందిస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్పిందని,ప్రభుత్వం మేలు చేస్తుందని ఓట్లు వేసి గెలిపించినా ప్రభుత్వం కనీసం కన్నెత్తికూడా చూడలేదని మండిపడ్డారు.లావేరు మండలంలో నారాయణ సాగర్ మీని రిజర్వాయర్ నిర్మిస్తామనే హామీని కూడా ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.ఎచ్చెర్ల నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా ఉందన్నారు.నీరు–చెట్టు కింద కొన్ని వందల కోట్లు అవినీతి జరుగుతుందన్నారు.టీడీపీ ప్రభుత్వం అవినీతి,అక్రమాలపై ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతారన్నారు.