ప్రజాసంక్షేమమే పార్టీ ధ్యేయం: తోపుదుర్తి

అనంతపురం 26 జూన్ 2013:

ప్రజాసంక్షేమమే ధ్యేయంగా స్థానిక ఎన్నికల్లో గెలుపునకు పనిచేస్తామని వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా నాయకురాలు తోపుదుర్తి కవిత చెప్పారు. హిందూపురంలో బుధవారం ఏర్పాటుచేసిన  పార్టీ  సమావేశంలో ఆమె ప్రసంగించారు. అందరూ కలిసికట్టుగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీబీఐ కాంగ్రెస్‌ చేతిలో కీలుబొమ్మగా వ్యవహారిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి మాట్లాడుతూ మంత్రి పదవి పోతుందేమోనని రఘువీరా రెడ్డి సహకార ఎన్నికలు వాయిదా వేశారన్నారు. అధికారం కోసం చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని విమర్శించారు.

Back to Top