కాల్ మనీ కి ప్రభుత్వానిదే బాధ్యత



హైదరాబాద్)
కాల్ మనీ సెక్స్ రాకెట్ కు ప్రభుత్వానిదే బాధ్యత అని వైఎస్సార్సీపీ అధికార
ప్రతినిధి, మాజీ మంత్రి పార్థ సారధి అభిప్రాయ పడ్డారు.  ముఖ్యమంత్రి
చంద్రబాబు తప్పుడు హామీల వల్లే బ్యాంకులు మహిళలకు రుణాలివ్వడం లేదని విమర్శించారు.ఈ
నేపథ్యంలో ప్రజలు గత్యంతరం లేక డబ్బులు కోసం కాల్ మనీ వంటి సంస్థలను
ఆశ్రయిస్తున్నారని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

 కాల్ మనీ - సెక్స్ రాకెట్ అంశంపై తమ పార్టీ అసెంబ్లీలో
ప్రభుత్వాన్ని నిలదీస్తుందని ఆయన చెప్పారు. కాల్ మనీ‑తో సంబంధమున్న వారిని ప్రభుత్వ
పెద్దలు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాల్ మనీ నిందితులను కఠినంగా
శిక్షించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై
నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు సూచించారు. 

 ఆంధ్రప్రదేశ్ బాక్సైట్ తవ్వకాలపై గిరిజనుల
మనోభావాలను తెలియజేసిన తమ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీపై టీడీపీ ప్రభుత్వం
తప్పుడు కేసులు బనాయించిందని గుర్తు చేశారు. ఇదేనా మహిళలు, గిరిజనుల మీద ఉన్న ప్రేమా అని చంద్రబాబును
సూటిగా ప్రశ్నించారు.

 

తాజా వీడియోలు

Back to Top