<strong>వైయస్ జగన్‌కు సమస్యలు చెప్పుకున్న ఫార్మసిస్టులు</strong>విజయనగరంః వైయస్ జగన్‌తో కలిసి ఫార్మసిస్టులు వాక్ విత్ జగన్ కార్యక్రమం నిర్వహించారు.తమ సమస్యలను వైయస్ జగన్‌కు వివరించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతి ఏడాది 160 కాలేజిల్లో 30వేల మంది ఫార్మసిస్టులు చదువుకుని బయటకు వస్తున్నారన్నారు. చదువుకోలేని వారు అద్దె సర్టిఫికెట్లుతో మెడికల్ షాపులు నడపడం వలన ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. మెడికల్‌షాపుల్లో మందులు విక్రయించే వ్యక్తి ఖచ్చితంగా ఫార్మసి చదువుకున్న వ్యక్తులే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫార్మసిస్ట్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. సెక్షన్ 42 ప్రకారం ఆసుప్రతులు, మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టులు మాత్రమే పనిచేయాలని కాని నకిలీ సర్టిఫికెట్లతో మెడికల్ షాపులను నడుపుతున్నారని నిబంధనలు ప్రకారం నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.