పార్ల‌మెంటు వేదిక‌గా పోరాటం

న్యూఢిల్లీ : ప్ర‌త్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరాటాన్ని ఉధృతం
చేస్తోంది. ఒక వైపు పార్టీ అధ్య‌క్షుడు, అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్
జ‌గ‌న్ న్యూఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర ధ‌ర్నా, పార్ల‌మెంటు దాకా
మార్చ్ కార్య‌క్ర‌మాలు ఉండ‌గా, మ‌రో వైపు పార్టీ ఎంపీలు పార్ల‌మెంటు లో ఈ
అంశాన్ని ప్ర‌స్తావ‌న‌కు తెచ్చారు. రోజు వారీ కార్య‌క‌లాపాల్ని ప‌క్క‌న
పెట్టి ముఖ్య‌మైన ప్ర‌జాహిత అంశమైన ఏపీకీ  ప్ర‌త్యేక హోదా మీద
చ‌ర్చించాల‌ని కోరుతూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ
త‌ర‌పున ఇచ్చిన ఈ నోటీసులో ఆంధ‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల మ‌నోభీష్టాన్ని వ్య‌క్తం
చేశారు. దీన్ని వెంట‌నే చ‌ర్చ‌కు చేపట్టాల‌ని డిమాండ్ చేశారు.
Back to Top