పల్లె పల్లెకు ప్రత్యేక హోదా


చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమాన్ని దశలవారీగా చేపడుతోంది. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఐదుగురు తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేపట్టారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేసేందుకు యువభేరి కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయానికి నిరసనగా విశాఖ, నెల్లూరు, అనంతపురం, గుంటూరు నగరాల్లో వంచనపై గర్జన దీక్షలు చేపట్టారు. తాజాగా వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్న గొట్టిగల్లు మండలం ఎగవూరు, దిగవూరు గ్రామాల్లో పల్లె పల్లెకు ప్రత్యేక హోదా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మహేంధర్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, ఎంపీపీ సంధ్య, నాయకులు సహదేవుడు, సాకిరి భూపాల్, శంకర్‌రెడ్డి, దేవ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
Back to Top