పేదరికం చదువుకు అడ్డుకాకూడదు





  • అధికార, విపక్షాల కుమ్మక్కుపై విజయమ్మ ధ్వజం


  • ఫీజు దీక్ష విరమణ


  • చంద్రబాబుపై మండిపాటు

హైదరాబాద్, సెప్టెంబరు 7:  ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కవడం చరిత్రలో ఎప్పడూ లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద గురువారం మొదలుపెట్టిన ఫీజు దీక్షను ఆమె శుక్రవారం సాయంత్రం విరమించారు. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులు ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వ వైఖరిని తూర్పారపట్టారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముందు చూపున్న వ్యక్తని పేర్కొన్నారు. డబ్బు లేక ఏ పేద వాడూ పెద్ద చదువులకు దూరం కాకూడదనేది ఆయన లక్ష్యమన్నారు. ఆ ఆలోచననుంచి పుట్టిందే ఫీజు రీయింబర్సుమెంట్ పథకమని విజయమ్మ వెల్లడించారు. విద్యా హక్కు చట్టం కంటే ముందే ఆయన ఈ పథకాన్ని రూపొందించారని చెప్పారు. విద్యార్థుల సంక్షేమానికి తపించారన్నారు. అర్హులకు మేలు చేకూర్చడానికి వైయస్ఆర్ ఎప్పుడూ లెక్కచేయలేదన్నారు. బడ్జెట్‌లో ఇంత ఖర్చవుతుందని ఆయన ఎప్పుడూ లెక్కవేయలేదన్నారు.
ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై విజయమ్మ మండిపడ్డారు. పన్నులతో ఖజానా నింపుకుంటూ, ప్రజలకు మేలొనగూర్చే పనులు చేయడానికి పిసినారితనం ప్రదర్శిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రస్తుత విధానం ప్రకారం పది వేల ర్యాంకుల లోపు, ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుకున్న వారిని ఎంచితే 500మించి ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ అందదని అభిప్రాయపడ్డారు. వైయస్ఆర్ ఆయన హయాంలో 25 లక్షల మందికి ఈ ప్రయోజనాన్ని కల్పించారని గుర్తుచేశారు. 
ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై విజయమ్మ మండిపడ్డారు. పన్నులతో ఖజానా నింపుకుంటూ, ప్రజలకు మేలొనగూర్చే పనులు చేయడానికి పిసినారితనం ప్రదర్శిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రస్తుత విధానం ప్రకారం పది వేల ర్యాంకుల లోపు, ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుకున్న వారిని ఎంచితే 500మించి ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ అందదని అభిప్రాయపడ్డారు. వైయస్ఆర్ ఆయన హయాంలో 25 లక్షల మందికి ఈ ప్రయోజనాన్ని కల్పించారని గుర్తుచేశారు. 
చంద్రబాబుపై ధ్వజం
ఫీజు రీయింబర్సుమెంటు పథకం తనదేనని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారనీ, ఆయన ఏనాడు కళాశాలలకు పోయిన పాపాన గానీ, విద్యార్థులతో మాట్లాడిన వైనం గానీ లేవని విజయమ్మ ఎద్దేవా చేశారు. ప్రజాప్రయోజన కార్యక్రమం దేనిపైనా ఆయన స్పందించడంలేదన్నారు.  ఎన్నికలలో బీసీలకు వంద సీట్లు ఇద్దామన్న తమ ప్రతిపాదనపై ఆయన మౌనంగా ఉన్నారన్నారు. గ్రామాలలో కరెంటు కోత 12 గంటలుంటోందనీ, ఉపాధి పనులలో కోత విధిస్తున్నారనీ, వృద్ధాప్య పింఛన్ల ఊసే లేదనీ..  ఇలాంటి ఏ అంశంపైనా ఆయన మాట్లాడటం లేదన్నారు. జగన్ బాబును ఎదుర్కోలేక రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయన్నారు. ఇలాంటి ఘటన చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. కాంగ్రెసుకు ప్రతిపక్షం ఉండకూడదనీ, చంద్రబాబు వేరే మీడియా ఉంటే సహించలేరనీ ఆమె ధ్వజమెత్తారు. చీకట్లో చిదంబరాన్ని కలిసిన చంద్రబాబు, కర్ణాటక గవర్నరు భరద్వాజ్‌నూ కలిశారన్నారు. అమీర్‌పేట భూముల కుంభకోణంలో కూడా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయన్నారు. 
అందరి టార్గెట్ జగన్
ప్రభుత్వం నుంచి సీబీఐ వరకూ అందరూ జగన్ బాబును టార్గెట్ చేసుకున్నారని ఆమె ఆరోపించారు. అందుకే  సీబీఐ ప్రభుత్వం స్థానంలో డాక్టర్ వైయస్ఆర్ పేరును, 52వ పేరుగా ఉన్న జగన్‌ను మొదటి నిందితుడిగానూ సీబీఐ తెరపైకి తెచ్చిందనీ, ఇందుకు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని విజయమ్మ ప్రశ్నించారు. త్వరలోనే జగన్ బయటకు వస్తారని ఆమె చెప్పారు.  

Back to Top