కర్నూలు, 12 నవంబర్ 2012: పేదల సంక్షేమమే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని షర్మిల అన్నారు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజాప్రస్థానం యాత్రకు సోమవారంనాడు జనం బ్రహ్మరథం పట్టారు. ఈ రోజు షర్మిల పాదయాత్రలో బెనగిరి గ్రామస్థులు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. తాము కనీసం తాగునీటికి కూడా నోచుకోవడం లేదంటూ వారు షర్మిల దృష్టికి తెచ్చారు. ప్రజల సమస్యలను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి గాని, దానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్న చంద్రబాబుకు గాని లేనందుకే ఇలాంటి సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని షర్మిల నిప్పులు చెరిగారు.<br/>దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మీకు ఏ విధంగా పైప్‌లైన్ వేసి నీళ్ళిస్తామన్నారో ఆ విధంగానే జగనన్న మీకు నీళ్ళు ఇస్తారన్నారు. మన ప్రభుత్వం వచ్చాక, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక, రాజన్న రాజ్యం వచ్చాక మీకు పైప్‌లైన్ ద్వారా తప్పకుండా నీళ్ళిస్తారని గ్రామస్థులకు షర్మిల భరోసా ఇచ్చారు.