పాదయాత్రకు నేను సైతం...

ఆలూరు 13 నవంబర్ 2012 : గుండె నిండా నిండిన అతడి అభిమానం వైకల్యాన్ని జయించింది. అందుకే ఉడతాభక్తిగా షర్మిల 'మరో ప్రజాప్రస్థానం'లో చురుకుగా పాల్గొంటున్నాడు.  పత్తికొండ మండలం పుచ్చలకాలమాడ గ్రామానికి చెందిన వికలాంగుడు కృష్ణ ట్రై మోటార్ సైకిల్‌పై షర్మిల యాత్రలో పాలుపంచుకుంటున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ప్రారంభించి పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర మీదుగా పాదయాత్ర వెంట సాగుతూ షర్మిల అక్క వెంటే ఉంటున్నాడు. వికలాంగులను ఆదుకున్నది మహానేత వైయస్సేనని పాదయాత్ర సాగుతున్న పలు గ్రామాలలో వికలాంగులకు చెబుతున్నాడు.

Back to Top