పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభం

జి.మామిడాడ, 12 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడలో బుధవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. తొలుత ఆమె గ్రామంలోని సూర్య దేవాలయంలో పూజలు చేశారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా శ్రీమతి షర్మిల తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పెదపూడి సమీపంలో మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అప్పటికి ఆమె 6.9కిమీ నడుస్తారు. అనంతరం 8.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. అచ్యుతాపురం సమీపంలో రాత్రి బస చేస్తారు. బుధవారం మొత్తం 15.5 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగుతుంది. జి. మామిడాడ, శివారు లక్ష్మీనరసింహాపురం, పెద్దాడ, పెదపూడి, దోమాడ, కరకుదురు, అచ్యుతాపురం మీదగా పాదయాత్ర చేస్తారు.

Back to Top