పాలక, ప్రతిపక్షాల కుమ్మక్కు. సౌకర్యాలు హుళక్కు

ఇబ్రహీంపట్నం:

చంద్రబాబు, కిరణ్ పరిపాలన తీరు ఒకేలా ఉందనీ, రెండూ జనం రక్తం పీల్చే పాలనలేననీ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. 57వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను పురస్కరించుకుని ఆమె గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె వివిధ ప్రాంతాలలో ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులు మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా జనం నెత్తిన ఒక్క రూపాయి భారం కూడా వేయలేదన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు నాటకాలాడుతున్నారని చెప్పారు. గురువారం పాదయాత్ర ముగిసేనాటికి శ్రీమతి షర్మిల 56రోజులలో 808 కిలోమీటర్లు నడిచారు.

రాబందుల రాజ్యం


     నాటి చంద్రబాబు పాలన.. నేటి కాంగ్రెస్ పాలన రెండూ జనం రక్తం తాగే రాబందుల రాజ్యాలే నని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. నాటి చంద్రబాబునాయుడి అడుగుజాడల్లోనే నేటి కిరణ్ సర్కారు కూడా నడుస్తోందన్నారు. ఆనాటి టీడీపీ పాలనకు, ఈ కాంగ్రెస్ పాలనకు తేడానే లేదంటూ పాలక, ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హయాంలో మాదిరే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కష్టాల ఊబిలోకి నెట్టేసిందని మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం 56వ రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో సాగింది. రావిరాలలో ‘రచ్చబండ’ నిర్వహించిన అనంతరం ఆదిభట్ల గ్రామంలో కిక్కిరిసిన జనసమూహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు.

Back to Top