డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ గా వేమారెడ్డి

వైఎస్సార్
జిల్లాః  వైఎస్సార్సీపీ నేత పాలగిరి వేమారెడ్డి వైఎస్సార్ జిల్లా సహకార
మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. కొన్ని
రోజులుగా ఖాళీగా ఉన్న ఈ పదవి భర్తీ కోసం జిల్లా సహకార అధికారి పోమ్యానాయక్
ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. వేమారెడ్డి ఒక్కరే నామినేషన్ వేయటంతో ఆయన
ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో  ఆయన్ను వైఎస్ చైర్మన్‌గా నియమించారు.
డీసీఎంఎస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆడిట్ అధికారిణి సుభాషిణి
పాల్గొన్నారు.
Back to Top