<br/><br/>రాప్తాడు: నాలుగుళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని నర్సింగ్ విద్యార్థులు జననేతకు తమ బాధను చెప్పుకున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు తరలివచ్చిన నర్సింగ్ విద్యార్థులు వైయస్ జగన్‌ను కలుసుకుని వినతిపత్రం అందజేశారు. ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులల్లో తమను నియమించాలని, నర్సింగ్ వ్యవస్థ అంటే ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి తమను ఆదుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ బేసిస్‌తో ఉద్యోగాల్లో తీసుకోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి కన్నీరు తుడుస్తానని హామీ ఇచ్చారన్నారు. జగనన్న అధికారంలోకి వస్తే మా బతుకులు బాగుపడతాయని విద్యార్థులు అన్నారు. జగనన్న వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉందన్నారు.