వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ఎన్‌ఆర్‌ఐల మద్దతు

 

అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. రాష్ట్ర ప్రజలే కాకుండా విదేశాల్లో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐలు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి వైయస్‌ జగన్‌ పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తున్నారు. మంగళవారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని కూరుకుంట గ్రామంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌కు కెనడాలో స్థిరపడ్డ ఫణిభూషణ్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రంలో తీవ్ర పేదరికం ఉంది, నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వ్యవసాయం కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతలే దేశానికి వెన్నుముక అని అలాంటి రైతుల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైందన్నారు. మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించే సత్తా వైయస్‌ జగన్‌లో కనిపించిందని చెప్పారు.  వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు చాలా బాగున్నాయి. మద్యనిషేదం నిజంగా చేస్తే దేశం కళకళలాడుతోందని అభిప్రాయపడ్డారు. 
Back to Top