అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు

హైదరాబాద్ : ఏపీ శాసనసభ ఇంఛార్జ్ సెక్రటరీ సత్యనారాయణ ఆ పదవికి అనర్హుడని పేర్కొంటూ  హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  మంగళగిరి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్కే పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా సత్యనారాయణకు లా డిగ్రీ లేదని ఆర్కే తరుఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ...నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Back to Top