మా నాయకుడికి మాట్లాడే అవకాశం కల్పించాలి

ఏపీ అసెంబ్లీ: శాసన సభ నిర్వాహణ తీరు దారుణంగా ఉందని, ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం కల్పించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లీకేజీపై ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందో అర్థం కావడం లేదన్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష నేతకు మైక్‌ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా అసెంబ్లీలో ఇదే తీరు కొనసాగుతోందని, విధి లేని పరిస్థితిలో మేం స్పీకర్‌ పోడియం ముట్టడించాల్సి వచ్చిందన్నారు. ఈ అంశంపై  సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని విషయాలు బయటపడుతాయని అభిప్రాయపడ్డారు.  మంత్రులను భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Back to Top