లక్షల టన్నులు అమ్ముకున్నాక ధాన్యం రేటు పెంచుతారా?

నెల్లూరు :

  రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి  సోమిరెడ్డి విఫలమయ్యారని  సర్వేపల్లి ఎంఎల్ ఎ కాకాణి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో ధాన్యపు కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం  ఆయన శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రైతులు దాదాపు 6 లక్షల టన్నుల బిపిటి ధాన్యాన్ని విక్రయించిన తరువాత ధాన్యపు ధర అంటూ మంత్రి  ప్రకటన పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్య సిగ్గుచేటని విమర్శించారు.  మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకుని రైతులకు కన్నీళ్లుపెట్టిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులకు  ప్రభుత్వం ప్రకటించిన ప్రకటించిన ధరలు రాకపోవడం శోచనీయమని ఈ పరిస్థితికి మంత్రి అవినీతే కారణమన్నారు. రైతులను మిల్లర్లు దోచుకుంటుంటే, అధికార యంత్రాగం చోద్యం చూడటం గర్హనీయమన్నారు.

Back to Top