టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం.

విజయనగరంః గజపతి నగరం నియోజకవర్గంలో వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాలు అధికంగా ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బొత్స  అప్పలనర్సయ్య అన్నారు. ప్రజా సంకల్పయాత్ర మంగళవారం నాడు గజపతినగరం జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ నియోజకవర్గంలో  వర్షాలు వస్తే గాని పంటలు పండే పరిస్థితులు లేవని,  సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో  దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన హయాంలో తోటపల్లి ప్రాజెక్టు బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా 15వేల ఎకరాలకు నీరు ఇవ్వాలనే ఆలోచన చేశారన్నారు. ఒక సంవత్సర కాలంలోనే సుమారు 12 కోట్లు వరుకూ ఖర్చుపెట్టారన్నారు టీడీపీ పాలనలో ఈ నాలుగున్నరేళ్లలో  రూ. 9 కోట్లు మించి పనులు జరగలేదని విమర్శించారు. మా ప్రాంతానికి నీరు ఎప్పుడు  వస్తుందా అని రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌  మోహన్‌ రెడ్డి సీఎం అయితేనే గాని నీరు వచ్చే పరిస్థితి లేదని ప్రజలు భావిస్తున్నారన్నారు. మానాపురం ప్లైఓవర్‌ బిడ్జ్రికి అప్రోచ్‌ రోడ్లు కూడా వేసే పరిస్థితి లేదన్నారు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. డిగ్రీ కాలేజికి కనీసం స్థల సేకరణ కూడా జరగడంలేదన్నారు .నియోజకవర్గంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతుందని ఆరోపించారు.. స్థానిక నాయకులు, ఎమ్మెల్యే వాటాలు వేసుకుని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌కు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు.
 
Back to Top