నివాళికి దూరంగా జగన్‌.. చాలా బాధాకరం: వైయస్‌ వివేకా

ఇడుపులపాయ, 2 సెప్టెంబర్‌ 2012 : మహానేత వైఎస్ఆర్ భౌతికంగా లేకపోయినా ఆయన ప్రజల మనసులో శాశ్వతంగా నిలిచిపోయారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ వివేకానందరెడ్డి అన్నారు. వైయస్ వర్ధంతి సందర్భంగా ఆదివారం వైయస్ వివేకా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తండ్రికి నివాళులు అర్పించే అవకాశం తనయుడికి లేకపోవడం బాధాకరమన్నారు.

గతేడాది తమతో గడిపిన జగన్‌, ఈసారి లేకపోవడం విచారకరమని వివేకా అన్నారు. అక్రమ కేసుల నుంచి జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. జగన్తోనే రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయలేమని చెప్పటం ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని వివేకానందరెడ్డి విమర్శించారు.

Back to Top