<strong>శ్రీకాకుళం, 28 మార్చి 2013:</strong> వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉన్నా ప్రజలు ఎదుర్కొటున్న సమస్యల గురించే నిరంతరం ఆలోచిస్తున్నారని నరసన్నపేట ఎమ్మెల్యే, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం ఉపనాయకుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీ జగన్ తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రజల గురించే ఆలోచిస్తుండటం అంటే నిజమైన నాయకత్వ లక్షణాలకు ప్రత్యక్ష నిదర్శనం అని కృష్ణదాస్ కొనియాడారు. శ్రీకాకుళం పిఎన్ కాలనీలో భారీ సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు గురువారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కృష్ణదాస్ మాట్లాడారు.<br/>'ప్రజా సమస్యలపై పోరాడండి. ప్రతినిత్యం ప్రజల్లోనే ఉండండి' అని శ్రీ జగన్ తమకు చెప్పారని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. తన గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా ఎంతసేపూ రాష్ట్ర ప్రజల కోసం, ఆనాడు మహానేత వైయస్ ప్రవేశపెట్టిన పథకాల అమలు కోసం ఆరాటపడుతున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టుల గురించి, ఆస్పత్రులు, విద్యాసంస్థల పనితీరు గురించి, జిల్లా ప్రజల సమస్యల గురించి శ్రీ జగన్ ఆరాతీశారని కృష్ణదాస్ పేర్కొన్నారు.<br/>స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. రోజు రోజుకూ వందలాది మంది పార్టీలో చేరుతున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి కార్యకర్తలుగా ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడటంతో ప్రజాసంబంధాలు ఉన్నవారంతా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు.