నిరాధార వార్తలు ప్రచురించవద్దు: పెన్మెత్స

విజయనగరం, 31 మార్చి 2013: ఎలాంటి ఆధారాలూ లేకుండా వార్తలు ప్రచురించవద్దని ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెన్మెత్స సాంబశివరాజు హితవు పలికారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావుతో తనకు విభేదాలున్నాయని ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని సాంబశివరాజు తీవ్రంగా ఖండించారు. విద్యుత్ ‌చార్జీల పెంపుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3‌వ తేదీన విజయనగరం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని సాంబశివరాజు తెలిపారు.
Back to Top