నీటి సమస్యపై పోరాడండి!

మల్లేనిపల్లి

26 అక్టోబర్ 2012 : మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా మల్లేనిపల్లికి వచ్చిన షర్మిల దారిలో స్థానిక మహిళలతో మాట్లాడారు. తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడనీ, తమకు ఆత్మహత్యే శరణ్యమనీ మహిళలు వాపోయారు. అది సమస్యకు పరిష్కారం కాదనీ, నిబ్బరంగా సమస్యలను ఎదుర్కోవాలనీ షర్మిల వారికి ధైర్యం చెప్పారు. వైయస్ హయాంలో ఎలా ఉండింది? ఇప్పుడెలా ఉంది? అంటూ ఆమె వారిని అడిగారు. కరెంటు విషయం చెప్పమనగానే అది అసలు ఉండనే ఉండదని వారు బదులిచ్చారు. సబ్సిడీలు వస్తున్నాయా అని అడగ్గా, సరిగా రావడం లేదని వారు అన్నారు. స్టోర్ బియ్యం గురించి ఆరా తీయగా అవి ఎటూ సరిపోవడం లేదని వారు చెప్పారు. తాగుదామంటే కనీసం నీళ్లు కూడా లేవనీ, రెండు మూడు మైళ్లు వెళ్లి నీళ్లు తెచ్చుకోవలసి వస్తోందనీ వారు వాపోయారు. కొత్తనీళ్లైతే ఆ నీళ్లలో కూడా కప్పలు, పురుగులు, పాములు వస్తున్నాయని, అలాంటి నీటినే తాము తాగవలసి వస్తోందనీ వారు ఒక్కసారిగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నీటి సమస్యపై పోరాడాలని షర్మిల పక్కనే ఉన్న అనంతపురం ఎమ్మెల్యే బి. గుర్నాథరెడ్డికి సూచించారు.

Back to Top