వైయ‌స్ జగన్ నవరత్నాలపై అభిమాని పాట

తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతామ‌ని వివ‌రించేందుకు వైయ‌స్ జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు అనే 9 ప‌థ‌కాలు ప్ర‌క‌టించారు. వాటిపై  ఇప్ప‌టికే విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా న‌వ‌ర‌త్నాల‌పై ఓ అభిమాన పాట‌ల సీడిని రూపొందించారు. అదిగ‌దిగో జ‌గ‌న‌న్న వ‌స్తున్నారు..రాజ‌న్న రాజ్యాన్ని తెస్తున్నారు..మ‌న‌స్సున మ‌న‌గాడు వ‌స్తున్నాడు..అన్న వ‌స్తున్నాడు అనే పాట‌ను పాడి వినిపించారు. ఈ సీడిని శ‌నివారం వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. ఈ పాటలు రాసి, పాడిన అభిమానిని వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. 

తాజా ఫోటోలు

Back to Top