కోరుకొండలో నవరత్నాలపై నియోజకవర్గ సదస్సు

కోరుకొండ : వైయస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైయస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకం పై నియోజకవర్గ స్థాయిలో కోరుకొండ శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళావేదిక ఆవరణంలో ఆదివారం 2.30 గంటలకు సదస్సు జరుగుతుందని వైయస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు, రాజానగరం నియోజకవర్గం సమన్వయ కర్త జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. శనివారం జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల నుండి పార్టీ నాయకులు, పోలీంగ్‌ బూత్‌ కమిటీ సభ్యులు, పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరైయ్యి నవరత్నాల సదస్సును విజయవంతం చేయాలన్నారు. ఈ నవరత్నాల పథకం ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ పథకంను గ్రామాల్లో ప్రజలందరికి తెలియపరిచే భాధ్యత పార్టీ అభిమానులు, నాయకులు అందరి పై ఉందన్నారు. పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రతిఒక్కరు పాటుపడాలన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ పథాకాలన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు, వారి అనుమాయులకే అందుతున్నాయన్నారు. రానున్న ఎన్నికలకు పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు అందరూ పాటుపడాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజావ్యతిరేక విదానాలకు పాల్పడుతుందన్నారు. దొరికినదంతా దోచుకోవడమే టీడీపీ నాయకుల ముఖ్య ఉద్దేశ్యమని ఆమె ధ్వజ మెత్తారు .

Back to Top